మీరు exam బాగా రాసినా pass అవలేక పోయారా?, మీరు guarantee గా మీ exam pass అవుతారని నమ్మకం ఉందా? ఐతే SBTET వారి Revaluation, recounting, Sending copy of your answer paper గురించి తెలుసుకోండి.
SBTET వారు exam results announce చేసాక students కోసం Revaluation, recounting, sending copy of your ans paper అనె options కి dates ఇస్తారు.
1. Revaluation అంటే మీ paper ని మళ్ళీ valuation చేసి ఎక్కడైనా తక్కువ మార్కులు పడినా, మార్కులు అసలు పడక పోయిన చూడటం. 2. Recounting అంటే front paper మీద ఎ ప్రశ్నకు ఎన్ని మార్కులు పడ్డాయో check చేసి మొత్తం మార్కులు ఎన్నోచాయో చూడటం. 3.Sending copy of your answer paper అంటే మీ valution ఐన paper ను xerox తీసి మీకు పంపిస్తారు.
అలా చేసినందుకు charge చేస్తుంటారు.
1. Recounting-400/- (ఇప్పుడు వేరే రేటు ఉండొచ్చు)
2. Sending copy of your ans paper-700/- (ఇప్పుడు వేరే రేటు ఉండొచ్చు)
3. Revaluation-3500/- (ఇప్పుడు వేరే రేటు ఉండొచ్చు)
ఐతే Revaluation, Recounting లో ఒక్క మార్కు మీకు కలిసినా మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తరు. ఒక్క మార్కు కూడా కలవకపోతే డబ్బు తిరిగి ఇవ్వరు.
చాల మంది స్టూడెంట్స్ direct Revaluation పెట్టేస్తారు అది చాల తప్పు మీ డబ్బు అనవసరం గా కోల్పోతారు. 1.మీరు చాల Super గా వ్రాసి “అంటే 80 కి 65 పైగా” వ్రాస్తే, ఫెయిల్ అయ్యారని “అంటే 28 కి తక్కువ” వస్తే, Recounting కి apply చెయ్యడం మంచిది. 2.మీకు పాస్ మార్కులకు 1 లేదా 2 లేదా 3 మార్క్స్ తక్కువగా వస్తే ఏమి apply చేయకుండా ఉండటమే మంచిది.. 3.లేదు మీకు బాగా నమ్మకం ఉంది పాస్ అవుతానని ఐనా ఫెయిల్ అయ్యాను అని అనుకుంటే Sending copy of your ans paper ki apply చెయ్యడం మంచిది. దీని వల్ల మీ మార్క్స్ ఎలా వేసారో చూసుకోవచ్చు..check చేసుకున్నాక అప్పుడు ఇంకా మార్క్స్ పడతాయి అనుకుంటే అప్పుడు Revaluation ki apply చెయ్యండి…దీని వల్ల 700/- తో seen అర్థమైపోతుంది. లేకపోతె 3500/- పోతాయి. నా 15 years experience లో Revaluation ఎవరికీ మార్క్స్ కలవలేదు..SBTET వరి valuation lo maximum పొరపాట్లు ఉండవు..ఏమైనా counting lo 1% ఉండొచ్చు..కాబట్టి చక్కగా అలోచించి apply చెయ్యండి.